అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం: బాలినేని
ప్రకాశం: వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ వారికే పెన్షన్లు, ఇళ్ల స్థలాలిచ్చారని ఆరోపించారు. వలంటీర్లు అర్హులైన ప్రతీ ఒక్కరినీ పార్టీలతో సంబంధం లేకుండా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించారు. నవరత్నాల్లో భాగంగా జనవరి 9న అమ్మఒడి ద్వారా అర్హులైన తల్లులందరికీ వారి ఖాతాలోకి నేరుగా రూ.15 వేలు వేస్తామని వెల్లడించారు.