రాజ్‌కోట్: మూడు టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. రెండో టీ20లో అదరగొట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రోహిత్ శర్మ ఫుల్, కట్ షాట్స్‌తో దుమ్మురేపాడు. ముఖ్యంగా మొసాదెక్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో రోహిత్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో సైతం రికార్డు స్థాయిలో ఐదు శతకాలు బాదిన రోహిత్, ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసన టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ బాదేసి పలు రికార్డులు బ్రేక్ చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఆట గురించి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో రోహిత్ ఆడే ఆటగాడు లేడంటూ కితాబిచ్చాడు.
.